Saturday, 17 December 2016

దిమ్మ తిరిగేలా రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్........................

                మెగా హీరోలంతా వరస పెట్టి రీమేక్ లు చేస్తున్న మాట నిజం. అంతెందుకు మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆ సినిమాలో తమిళంలో హిట్టైన కత్తి రీమేక్. మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా చిత్రీకరణలో బీజీగా ఉన్నారు. ఆ సినిమా కూడా తమిళంలో అజిత్ చేసిన వీరమ్ రీమేక్. ఇక మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ ఇటీవలే 'ధ్రువ' విజయంతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన తని ఒరువన్ రీమేక్. ఇలా వరస పెట్టి రీమేక్ లు చేస్తూండటంతో... మెగా హీరోలు రీమేక్‌లే ఎందుకు చేస్తున్నారంటూ సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. ఈ చర్చ విషయం రామ్ చరణ్ వద్దకు చేరింది. దాంతో ఆయన స్ట్రాంగ్ గానే వివరణ ఇచ్చారు.రీమేక్స్ అయినా అవి కూడా సినిమాలేనని గుర్తుంచుకోవాలన్నాడు. 
              రీమేక్ చేసేందుకు కథల్లేకనో, కొత్త కథలతో చేయలేకనో రీమేక్స్‌ను నమ్మకోలేదని చరణ్ స్పష్టం చేశాడు. రీమేక్ చేసేందుకు అనువుగా కథలు బాగున్నప్పుడు తప్పు లేదన్నారు.
              మెగా ఫ్యామిలీ మొత్తం రీమేక్స్ ఎందుకు చేస్తోందనే కామెంట్స్‌ను అస్సలు పట్టించుకోవద్దనీ, మంచి సినిమా మీ ముందు ఉంటే వాటి ఊసెందుకన్నాడు. సినిమాకు అవధులు లేవని తాను నమ్ముతానన్నాడు. ధృవ రీమేక్ అయినా ప్రేక్షకులు ఆదరించారనీ, అదే విధంగా చిరు ‘ఖైదీ నెం-150', పవన్ ‘కాటమరాయుడు'ని ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
             అందుకే మేమంతా రీమేక్ లు .. మంచి కథలను ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశంతో నిజాయితీగా చేస్తున్న ప్రయత్నమిది. అందుకే నేను, నాన్న, బాబాయ్‌ రీమేక్‌లు చేస్తున్నాం. దీనిపై మరీ ఆలోచించకుండా.. సినిమాలను చూసి ఆనందించాలంటూ ప్రేక్షకులను కోరారు.

No comments:

Post a Comment